Sunday, August 29, 2010

కేండ్రుక అర్జున్ ను మావోయిష్టులు ఎందుకు చంపారు?

కేండ్రుక అర్జున్ చాషీమూలియా ఆదివాసి సంఘం కోరాపుట్ జిల్లా కార్యదర్శి.9-8-2010న మావోయిష్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులున్న దళం ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు అతని గ్రామ సమీపాన పార్వతీపురం – కోరాపుట్ రోడ్డుపై కాల్చిచంపారు. భార్యను వైద్యం కోసం సైకిల్ పై ఎక్కించుకుని వెళుతుండగా ఎస్.ఎల్.ఆర్. రైఫిల్ తో గొంతు వద్ద, 303 తుపాకితో గుండెపై నాలుగు గుండ్లు కాల్చి చంపారు. తన భర్తను చంపవద్దని ఆమె దళంలోని ఒక సభ్యుని కాళ్ళు వాటేసుకుని అర్ధించింది. స్త్రీలు వందలాదిమంది విలపించారు. దాదాపు వెయ్యి మంది అర్జున్ శవాన్ని సంతపోగుపల్లి నుంచి ఏడు కిలోమీటర్ల దూరానగల ఏడుగుమ్మాలవలస వరకు భుజాలపై మోసుకెళ్ళారు.

తమకు నచ్చని రాజకీయ శక్తులను ప్రస్తుత రాజ్యం మట్టుపెడుతున్న తీరులోనే మావోయిష్టు పార్టీకూడా తమకన్నా భిన్నమైన పంధాలో ప్రజా ఉద్యమాలని నిర్మిస్తున్నవారిని భౌతికంగా నిర్మూలించబూనుకోవడం అత్యంత శోచనీయమైన విషయం. సిపిఐ ఎంఎల్ విశ్వం నాయకత్వాన నిర్మింపబడుతున్న ప్రజా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చెయ్యడం కోసం, ఆ ప్రాంతం నుండి ఆ పార్టీని తరిమివేయడం కోసం తద్వారా ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్ గ్రామాలన్నిటినీ మీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చాషీమూలియా ఆదివాసీ సంఘం నాయకులను, సానుభూతిపరులను హత్యచేస్తున్నారనీ, బెదిరిస్తున్నారనీ మేము భావిస్తున్నాము. మాలేఖకు బహిరంగ సమాధానము లభిస్తుందని ఆశిస్తున్నాము.

ఓపిడిఆర్ ఇమెయిల్ opdr_ap@hotmail.com

C.Bhaskararao ,chavali.Sudhakararao, v.Narayana

2 comments:

  1. politisians and nalsals say to people we are for people..

    but what hapen now and hear

    ReplyDelete
  2. ఇలా ఇక్కడ ఆ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాల నేపథ్యం తెలీని వారి సానుభూతి పొందడానికి రాసినట్లుగా వుంది. ఈ సంఘంవాళ్ళు ఇంతకుముందు తమనుండి విడిపోయిన వారిపై దాడిచేసి ఆడవాళ్ళని, పిల్లలను 70 మందికిపైగా కిడ్నాప్ చేయడం, వారి ఇల్లను తగలబెట్టడం అర్జున్ నాయకత్వంలో జరగలేదా? ఆ తరువాతనుండి హత్యగావింపబడ్డ సింగన్న నాయకత్వంలో మీ దాడులకు వ్యతిరేకంగా జనం ఒక్కటవుతున్నారని, మీరు స్థానిక షాహుకార్లతో, సొండీలతో కుమ్మక్కయిన దానిని బయటపడటంతో పోలీసులు ఏర్పరచిన శాంతి సైన్యంతో చేతులు కలిపి మిగులు భూమి పంపిణీలో పూర్తిగా ఆదివాసీ ప్రజలకే చెందాలన్న సింగన్న వర్గం డిమాండ్ ను మీరు అడ్డుకోవడానికి వాళ్ళపై పోలీసుదాడులను, ప్రైవేటు సైన్యాల దాడులను పురికొల్పినందుకు ప్రజా వ్యతిరేకులుగా మారినందుకే ఈ హత్య జరిగిందన్నది వాస్తవంకాదా? మీ పోరాటాలకు పోలీసులండదండలుండటం మూలంగా మావోయిస్టులపై విషప్రచారం చేస్తూ వాళ్ళని రానివ్వద్దని గ్రామాలలో ప్రచారం చేయడం అబద్ధమా? మీకున్న ప్రచార అవకాశాలు ఎలా వచ్చాయి. పార్వతీపురంలో ఓ పెద్ద రెండంతస్తుల పోష్ బిల్దింగ్ కార్యాలయంగా ఎలా నిర్మించుకోగలిగారు. కాంగ్రెసుకు కానీ, టిడిపి వాళ్ళకు కూడా లేని బిల్డింగ్ మీకెలా వచ్చింది? మీ కార్యకర్తలు కాంట్రాక్టులు చేయడంలేదా? వారి ఆస్తిపాస్తులు ఎలా పెరిగాయి? విప్లవ పార్టీ బహిరంగ కార్యాలయం ద్వారా ఎలా పనిచేయగలుగుతోంది?

    ReplyDelete